ఫ్యాషన్ టెక్నాలజీ ప్రవేశాలకు నోటిఫికేషన్! 19 d ago
దేశంలో హైదరాబాద్ సహా 19 నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్)లు ఉన్నాయి. ఫ్యాషన్ టెక్నాలజీతో పాటు యాక్సెసరీ డిజైన్, నిట్‌వేర్ డిజైన్, ఫ్యాషన్ కమ్యూనికేషన్, లెదర్ డిజైన్, ఫ్యాషన్ డిజైన్, టెక్స్‌టైల్ డిజైన్, ఫ్యాషన్ ఇంటీరియర్స్ కోర్సులు అందిస్తున్నాయి. రెండేళ్ల పీజీలో డిజైన్, ఫ్యాషన్ మేనేజ్ మెంట్, ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులు ఉన్నాయి. నిఫ్ట్‌ల్లో 5500 కు పైగా సీట్లు ఉన్నాయి. ఇందులో చేరదలచుకున్న అభ్యర్ధులకి పరీక్షతో అవకాశం లభిస్తుంది. ఈ స్కోరుతోనే దేశవ్యాప్తంగా పలు ఇతర సంస్ధల్లోనూ చేరవచ్చు.బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ లో చేరదలచుకున్న అభ్యర్ధులకి ఇంటర్మీడియట్ లేదా సమాన ఉత్తీర్ణత ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ లో చేరు అభ్యర్ధులకి మ్యాథ్స్, ఫిజిక్స్‌తో ఇంటర్ ఉత్తీర్ణత లేదా మూడేళ్ల డిప్లొమా కలిగి ఉండాలి. ఇందులోనూ చివరి ఏడాది విద్యార్ధులూ అర్హులే. ఈ రెండు కోర్సులకూ ఆగస్టు 1, 2025 నాటికి 24 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు ఐదేళ్లు మినహాయింపు ఉంటుంది.మాస్టర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్ లో చేరదలచుకున్న వారికి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత లేదా నిఫ్ట్ లేదా నిడ్ నుంచి కనీసం మూడేళ్ల వ్యవధితో యూజీ డిప్లొమా కలిగి ఉండాలి. మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ లో చేరేవారికి నిఫ్ట్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (బీఎప్‌టెక్) లేదా ఏదైనా సంస్ధ నుంచి బీఈ/ బీటెక్ కలిగి ఉండాలి. చివరి ఏడాది విద్యార్ధులూ దరఖాస్తు చేసుకోవచ్చు. పీజీకి గరిష్ఠ వయసు నిబంధన ఏమీ లేదు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 6. ప్రవేశ పరీక్షను ఫిబ్రవరి 9 తేదీన నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయాలి.